Thursday, December 19, 2024

మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి రక్షణ చర్యలపై నీటిపారుదల శాఖ కసరత్తు మొదలైంది. బ్యారేజి ఎగువ భాగంలో కాఫర్ డ్యాంను నిర్మిం వరద నీటిని నిల్వ చేసి పంపింగ్ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అవసరం అయ్యే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారిస్తోంది. ఆదిశలో వీరేంద్ర టెక్స్‌టైల్ ఏ జెన్సీతో ఇరిగేషన్ శాఖ అధికారులు భేటీ అయ్యారు. జియో ట్యూబ్, జియో టెక్స్‌టైల్ టెక్నాలజీలపై ఆసంస్థ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. అతి తక్కువ ఖర్చు వరద నీటి నియంత్రణ, కరకట్టల రక్షణ సా ధ్యమేనని నిర్ధారణకు వచ్చారు. పర్యావరణానికి కూడా అనుకూలమైన ఆ పరిజ్ఞానాన్ని మేడిగడ్డ బ్యారేజి దగ్గర వినియోగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకుపియర్ వద్ద భారీ బుంగ బయటపడుతున్న ఇంజనీరింగ్ లోపాలు రేడియం గేట్ల ఎత్తివేతతో భారీ శబ్ధాలు

త్వరలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వీరేంద్ర టెక్స్టైల్ సంస్థ ప్రతినిధి బృందం హైదారాబాద్ సందర్శించింది. జలసౌధలో ఇరిగేషన్ శాఖ అధికారులతో భేటీ అయింది. అతితక్కువ తక్కువ ఖర్చుతో వరదల తాత్కాలిక నియంత్రణ, కరకట్టల రక్షణను సమర్థవంతంగా చేసే అంశంపై సంస్థ ప్రతినిధులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు . ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరేంద్ర ఏజెన్సీ ప్రతినిధులు జియో టెక్స్‌టైల్, జియో ట్యూబ్, జియో మ్యాట్రిస్, రోప్ గేబియన్స్ టెక్నాలజీ ప్రయోజనాలు, తదితర అంశాలపై ఇచ్చిన ప్రజెంటేషన్ను ఇరిగేషన్ శాఖ అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా అధికారులు లేవనెత్తిన అనేక సందేహాలను సంస్థ ప్రతినిధులు నివృత్తి చేశారు.జియో ట్యూబ్‌లు, జియో టెక్స్‌టైల్ కంటైనర్లు కరకట్టల రక్షణకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు.

ప్రాజెక్టు దగ్గర దొరికే ఇసుకను జియో ట్యూబ్‌ల్లో నింపి, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా నీటిని నిల్వ చేయొచ్చని తెలిపారు. ఈ పద్దతి పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా నిర్మాణం, నిర్వహణ ఖర్చులు కూడా అతి తక్కువ అని సంస్థ ప్రతినిధులు తమ ప్రజెంటేషన్ లో వెల్లడించారు. 2010 లో ఈ టెక్నాలజీని మొదటిసారిగా అస్సాం రాష్ట్రం బ్రహ్మపుత్ర నదిలో నీటిని నిలువరించడానికి వినియోగించారు. ఇప్పటికీ అక్కడ అది విజయవంతంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత చవకైన ఈ పరిజ్ఞానంపై నీటిపారుదల శాఖ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News