Monday, January 20, 2025

జీ స్కేర్.. షోకాజ్ బేఖాతర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి నిబంధనలకు విరుద్ధంగా కబ్జా చేసి ప్రహరీ, రోడ్డును అక్రమంగా నిర్మించిన ఓ రియ ల్ సంస్థపై అధికారులు చర్యలు తీసుకోవడం లే దన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ క్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసికి చెందిన ఓ ఇం జినీర్ దానిని ధ్రువీకరించి నివేదిక ఇస్తే జిహెచ్‌ఎంసి ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ నుంచి సాగర్ హైవేపై ‘వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్’ అనే రి యల్ సంస్థ 497 ప్లాట్‌లోని (సర్వే నెంబర్ 149, 150, 151, 152, 153, 154, 156, 158) ల లో ఈడెన్ గార్డెన్ తపోవన్ కాలనీ వద్ద చేసిన వెం చర్‌కు సంబంధించి స్థానికులు, కార్పొరేటర్ ఎం. లచ్చిరెడ్డి నుంచి (22.11.22) తేదీన అందిన ఫిర్యాదుల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి సర్కిల్ 3, హయత్‌నగర్, ఎల్‌బినగర్ జోన్, రంగారెడ్డి జిల్లా అధికారులు డిసెంబర్ 16వ తేదీన ఆ సంస్థకు (344/UC/W.No.14/ IR3/TPS/ GHMC/ 2022, తేదీ.16.12.2022న షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసుకు లిఖిత పూర్వకంగా వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వడంతో పాటు శాంక్షన్ ప్లాన్, ఓనర్‌షిప్ డాక్యుమెంట్లను తీసుకురావాలని ఆ సంస్థకు జిహెచ్‌ఎంసి ఆ నోటీసులో సూచించింది. అయినా 17 రోజులైనా ఇప్పటివరకు ఆ సంస్థ వివరణ ఇవ్వకపోగా జీ స్కేర్ పేరుతో భారీగా ప్లాట్లను విక్రయించడానికి పచారం తెర తీసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి 17 రోజులైనా అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించడం లేదనే విషయమై జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారిని ఉమ వివరణ కోసం ప్రయత్నించగా ఆమె ఫోన్‌పై స్పందించలేదు. ఇచ్చిన గడువు ప్రకారం సంజాయిషీ ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ఈ అధికారి ‘మన తెలంగాణ’ ప్రతినిధికి వారం రోజుల క్రితం వివరణ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఈ ప్రాంతంలో వరదల సమయంలో కాలనీలు ముని గే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మాణం
ఈ సంస్థపై చర్యలు తీసుకోకుండా ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అన్న విషయాన్ని వెంటనే తెలియచేయాలని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా 65 ఎకరాల్లో లే ఔట్‌ను చేసిన ఈ సంస్థ 484 ప్లాట్లను అమ్మడానికి ప్రయత్నిస్తోందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా జిహెచ్‌ఎంసి పరిధిలో లే ఔట్‌లను చేస్తే కంపౌండ్ వాల్‌ను నిర్మించవద్దని జిహెచ్‌ఎంసిలో నిబంధనలు ఉన్నాయి. అయినా సదరు సంస్థ నిబంధనలను అతిక్రమించి భారీ కంపౌండ్ వాల్‌ను, రోడ్డును నిర్మించింది. అటవీ భూమిని, నాలాను పూడ్చివేసి వెంచర్ వేశారని ఫిర్యాదు చేసినా స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్‌ఎంసి అధికారులు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారని ఫిర్యాదు చేసినా లచ్చిరెడ్డితో సహా స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News