Sunday, December 22, 2024

ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చెంబూర్‌ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. గ్రౌండ్ ప్లస్ వన్(జీ+1) బిల్డింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో దుకాణం ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో పై అంతస్తులో నివసిస్తున్న కుటుంబం మంటల్లో చిక్కుకుని సజీవదనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను బయటకు తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులను పారిస్ గుప్తా(7), మంజు ప్రేమ్ గుప్తా(30), అనితా గుప్తా(39), ప్రేమ్ గుప్తా(30), నరేంద్ర గుప్తా(10)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News