Thursday, January 23, 2025

భీవండిలో కూలిన భవనం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని భీవండిలో ఆదివారం తెల్లవారుజామున రెండంతస్తుల భవనం కూలిపోయింది. దర్గా రోడ్డులోని దోబీతాలౌ ప్రాంతంలో భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులలో ఎనిమిది నెలలల చిన్నారి, ఉజ్మా అతిఫ్ మోమిన్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. శిథిలాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఏడుగురిని కాపాడారు. అర్థరాత్రి 12.35 నిమిషాలకు భవనం కూలినట్టు స్థానికులు వెల్లడించారు. గాయపడిన వారు మోమిన్ లాతీఫ్(65), ఫర్ జానా అబ్దుల్ లతీఫ్(50), బుష్రా అతిఫ్ లతీఫ్(32), అదిమ్ అతిమా మోమిన్(7), యుర్సా అతిఫ్ మోమిన్(3)గా గుర్తించారు.  ప్రస్తుతం వీరు ఆల్ మోయిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: సోనియా గాంధీకి స్వల్ప జ్వరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News