Thursday, May 1, 2025

ఢిల్లీలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందిన విషాద సంఘటన ఢిల్లీ నగరంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముస్తఫాబాద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయిందని.. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణంలో అకస్మాత్తుగా వాతావరం చల్లబడి.. పలు ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భవనం కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News