Sunday, December 22, 2024

మీరట్‌లో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు బందీ

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శనివారం సాయంత్రం ఓ భవనం కుప్పకూలింది. శిధిలాల కింద పలువురు చిక్కుపడ్డట్లు గుర్తించారు. ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. మీరట్‌లోని జకీర్ కాలనీలో ఈ పాత భవనం కూలింది. ఇటీవలి వర్షాలతో ఇది దెబ్బతిని దుర్ఘటనకు దారితీసింది. ఘటన గురించి తెలియగానే సిఎం యోగి ఆదిత్యానాథ్ స్థానిక అధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడాలని సూచించారు. గాయపడ్డ వారికి తగు చికిత్సలకు పురమాయించారు. లక్నోలో ఇటీవలే ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఎనమండుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇప్పుడు మీరట్‌లో భవనం కూలింది. శిథిలాల కింద ఎందరు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News