Tuesday, December 3, 2024

గ్యాస్ సిలిండర్లు పేలి ఇల్లు ధ్వంసం.. 8 మందికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

వంట గ్యాస్ సిలిండర్లు పేలి ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని రావుల చెరువు సమీపంలో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇల్లు కుప్పకూలింది.

ప్రమాద సమయంలో ఇల్లు ఉన్న వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయడ్డరు.విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News