Sunday, December 22, 2024

కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 35 మంది సజీవదహనం..మృతుల్లో భారతీయులు

- Advertisement -
- Advertisement -

కువైట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ మంగాఫ్ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 35 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ (కునా) వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది లోపల చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కేరళీయులు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి.

“దట్టమైన పొగతో ఊపిరాడక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40మందికి పైగా సృహ తప్పి పడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అందుపు చేశారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు” అని సీనియర్ పోలీసు కమాండర్ తెలిపారు.

అగ్నిప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు చెప్పిన 35 మరణాలకు అదనంగా నలుగురి మరణాలు ఉన్నాయా? అనేది స్పష్టంగా తెలియలేదు. మంటలను అదుపు చేశామని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News