హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై సిఎం రేవంత్ రెడ్డి స్పం దించారు. అలాంటి అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైడ్రా పేరుతో నోటీసులు ఇచ్చి భయపెట్టి డబ్బులు వసూలు చే సే వారిపై ఫోకస్ పెట్టాలని ఎసి బి, విజిలెన్స్ అధికారులను సి ఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెం డు, మూడేళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులను అడ్డం పెట్టుకొని కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్దఎత్తున ప్ర భుత్వానికి ఫిర్యాదులు వచ్చా యి. ఈ అంశంపై సిఎం తీవ్రం గా స్పందించారు. హైడ్రా పేరు తో, నోటీసుల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారుల వివరాలను సైతం ఇ వ్వాలని సిఎం సూచించారు. వారిపై కఠిన చర్యలు తప్పవని సిఎం హెచ్చరించారు.అతిక్రమించిన వారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనీ, వారిపై కఠినంగానే వ్యవహరించనున్నట్టు తెలిసింది.
అధికారులు వీరే
చెరువుల్లో అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన జీహెచ్‌ఎంసికి చెందిన ఓ డిప్యూటీ కమిషనర్, నిజాంపేట్ మునిసిపల్ కమిషనర్, బాచుపల్లి తహాశిల్దార్, చందానగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఓ సర్వేయర్, ఓ ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేసిన అధికారి పేర్లు ఉన్నాయనేది హైడ్రా వర్గాల సమాచారం. నియమనిబంధనలను అతిక్రమించి చెరువుల్లో, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసిలు, రెవెన్యూ స్కెచ్‌లు జారీచేసిన అధికారులపై కేసులు నమోదుకు హైడ్రా సన్నాహాలు చేస్తోంది. చందానగర్, గండిపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లోని చెరువుల్లో భవనాలకు అనుమతులు, ఎన్‌ఓసిలు, రెవెన్యూ స్కెచ్‌లు జారీచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు టాక్. ప్రస్తుతం కొన్ని చెరువుల ప్రాంతాల్లోని నిర్మాణాల విచారణ జరిపితే ఆరుగురు అధికారుల సంగతి బయటపడింది. మిగతా చెరువుల్లోని నిర్మాణాలను తనిఖీలు చేపట్టి, విచారణ జరిపితే ఎంతమంది భాగోతం బయటపడుతుందోనని హైడ్రా అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్లానింగ్ అధికారులే
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా అందజేసిన జాబితాలో ప్లానింగ్ అధికారులే ముగ్గురున్నారనేది సమాచారం. ముఖ్యంగా చెరువుల్లోని భవన నిర్మాణ అనుమతులు మంజూరులో జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు అధికారులు ఉన్నారని సమాచారం. నగర శివారు ప్రాంతాల్లోని నీటివనరుల పరిధిలో కట్టడాలకు అనుమతులు మంజూరు చేయడంలో, ఎన్‌ఓసిలు జారీ, రెవెన్యూస్కెచ్‌లు ఇచ్చిన వారిపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. మీర్‌పేట్, ఉప్పల్, జీడిమెట్ల, అమీన్‌పూర్, హయత్‌నగర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లోని చెరువుల్లోకి వచ్చిన నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించినట్టు తెలిసింది. ఇక్కడ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారా.? సంబంధిత అధికారులు నోటీసులు జారీచేశారా? ఎన్‌ఓసిలు ఉన్నాయా? ఎన్ని అంతస్థులకు అనుమతులు, ఎన్ని అంతస్థులు నిర్మించారనేది కూడా హైడ్రా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని సైబరాబాద్ పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.