Friday, December 20, 2024

భవిష్యత్ తరాల అవసరాలకు దూరదృష్టితో ఆర్వోబి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ అన్నారు.గురువారం కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్ట పల్లి వద్ద 154.74 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, కలెక్టర్, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యే రవిశంకర్,బాలకిషన్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దూరదృష్టితో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణాన్ని చేపడుతున్నామని,కార్పోరేషన్ పరిదిలో రైల్వే ట్రాక్ ఉంటే ఖచ్చితంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉండాలని, అందుకు అనుగునంగా 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో ఆర్వోబిని నిర్మించడానికి శ్రీకారం చుట్టామన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి కావాలసిన సర్వీస్ రొడ్ల నిర్మాణం, స్థలసేకరణ, ఇతర వసతులను కల్పించి ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగు తుందని వివరించారు.

బ్రిడ్జి నిర్మాణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సర్వే పనులను చేపట్టడం జరుగుతుందని, పనులు సకాలంలో పూర్తిచేసేలా తగినచర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూఆర్వోబి నిర్మాణాన్ని 4 వరుసల మార్గంగా తీర్చిదద్దడం జరుగు తుందని, పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు కనెక్టివిటీ రావడంతో, ఈ లైన్లో రైళ్ళ రాకపోకలు పెరిగాయని. ప్రధానంగా గూడ్స్ రైళ్ళు ఈ లైన్ గుండా వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తయాని, ఈ సమస్యలకు శాస్వత పరిష్కారాన్ని చూపేలా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణణ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి – హరి శంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు ,కార్పోరేటర్లు కాసెట్టి లావణ్యశ్రీనివాస్,కంసాల శ్రీనివాస్, కొలగాని శ్రీనివాస్,సుదగోని మాధవికృష్ణగౌడ్ ,కరీంనగర్ ఎఎంసి చైర్మెన్ రెడ్డవేని మధు,నాయకులు తుల బాలయ్య,కాసెట్టి శ్రీనివాస్,మాజి ఎంపిటిసి భూమన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News