Friday, November 22, 2024

గుజరాత్ లో కూలిన ఆరంతస్థుల భవనం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని సూరత్ లో ఆరంతస్తుల మేడ శనివారం మధ్యాహ్నం కూలింది. శిథిలాల నుంచి చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఓ మహిళను వారు రక్షించారు. ఇంకా చాలా మంది శిథిలాల కిందే ఉన్నారని వార్త.

పోలీసు వర్గాల కథనం ప్రకారం మధ్యాహ్నం 3.00 గంటలకు పాలిగామ్ లోని డిఎన్ నగర్ సొసైటీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చోర్యాసీ ఎంఎల్ఏ సందీప్ దేశాయ్, సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌట్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సౌరభ్ పార్ధి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారి బసంత్ పారీక్ రక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. శిథిలాలను తొలగించేందుకు జెసిబి మెషన్లను ఉపయోగిస్తున్నారు. అనేక పెద్ద స్లాబులను డ్రిల్లింగ్ మెషిన్ల ద్వారా విరగొట్టారు.

సాయంత్రం చీకటి పడుతున్నందున అధికారులు కనిపించే విధంగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. కూలిని ఆ ఆరంతస్థుల బిల్డింగ్ లో అనేక మంది జౌళి కార్మికులే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News