Thursday, January 23, 2025

ఆకట్టుకుంటున్న ప్రభాస్ ‘బుజ్జి’.. కీర్తి సురేష్ వాయిస్..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈక్రమంలో విడుదల చేసిన ఓ స్పెషల్‌ వీడియో ఆకట్టుకుంటోంది. మన జీవితంలోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతుందని ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అందరూ తను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించే ప్రభాస్ పోస్ట్ పెట్టాడని భావించారు.

అయితే, పెళ్లి గురించి పెట్టిన పోస్ట్ కాదని తేలిపోయింది. కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ పోస్ట్ పెట్టారు ప్రభాస్. తాజాగా ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ని పరిచయం చేశారు మేకర్స్. బాడీ లేని బుజ్జి బ్రెయిన్‌ని పరిచయం చేస్తూ.. బుజ్జిని చూడాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే అంటూ విడీయోను విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎంటంటే.. హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ తో వదిలిన వీడియోలో బుజ్జి క్యారెక్టర్.. అందరిలో ఆసక్తిని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News