Wednesday, January 22, 2025

బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా నిలువు దోపిడీ

- Advertisement -
- Advertisement -

భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు
గిన్నె మొదలు నీళ్ల వరకు వారివద్దే తీసుకోవాలి
అధిక రేట్లతో అడ్డంగా దోపిడీ
చోద్యం చూస్తున్న అధికారులు

మన తెలంగాణ/ పంజాగుట్ట : అది యావత్ తెలంగాణ లోనే నిరుపేదలకి, మధ్య తరగతి ప్రజలకు ఎంతో విశ్వా సం ఉన్న దేవాలయం, అక్కడ మొక్కులు తీర్చుకుందామని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. అదే నగరంలోని బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి దేవాలయలంలో భక్తుల బలహీనతని ఆసరాగా చేసుకుని, వారిని నిలువు దోపిడీ చేస్తున్నా రు. కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లు, వివరాల్లోకి వెళ్తే నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి యావత్ తెలంగా ణ నుండి ప్రతి మంగళవారం, ఆదివారం మొక్కులు తీర్చుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటారు. అక్కడే బస చేసి, అమ్మ వారికి మొ క్కులు చెల్లించి అక్కడే వంట వార్పు చేసుకోవడం ఆనవాయితీ, కావున అమ్మవారి భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్ముతారు. ఐతే అక్కడ భక్తులు బస చేయడానికి దేవస్థాన ం పక్కనే కొన్ని షెడ్‌లను ఏర్పాటు చేసింది. ఆ షెడ్‌లను నామ మాత్రపు అద్దెకు భక్తులకు ఇచ్చేందుకు దేవస్థానం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు ఆప్పగిస్తారు.

ఐతే ఈ కాం ట్రక్టర్లు కేవలం షెడ్‌లను అద్దెకు ఇవ్వడమే కాకుండా కొత్త దందా మొదలు పెట్టారు. షెడ్ తీసుకున్న భక్తులు తమ వద్దే వంట సామగ్రి అద్దెకు తీసుకోవాలని బలవంతం చేస్తూ ఇష్ట ం ఉన్నట్టు ఆ పాత్రలకు అద్దె వసూలు చేస్తూ భక్తుల నుండి దోచుకుంటున్నారు. గిన్నె మొదలు చెంచా వరకు వారి వద్దే అద్దెకు తీసుకోవాలని, ఒత్తిడి చేస్తున్నారు. నిరుపేద భక్తులు ఇంటి నుండి గిన్నెలు తెచ్చుకున్న వాటిని పక్కన పెట్టి అద్దె కి తీసుకోవాలని హుకుం జారీ చేస్తారు. చివరికి మంచి నీళ్లు సైతం వాళ్ళ వద్ద మాత్రమే కొనుగోలు చేయాల్సిందే, లేద ంటే గొడవకు దిగుతారు. ఇక ఆ మంచి నీళ్ల బాటిల్ కూడా బయట 25 రూపాయలు ఉంటే 50 రూపాయలు వసూలు చేస్తారు. ఇక వంట పాత్రలు అద్దె కూడా అధికంగా ఉంటు ంది. ఇక మంచి పండుగల సమయంలో అక్కడ షెడ్ కావా లి అంటే బ్లాక్‌లో వేలల్లో చెల్లించాల్సిందే, ఇలా ఒక్కటి ఏంటి అడుగు వేస్తే డబ్బు కావాల్సిందే. లేదంటే అక్కడ కాం ట్రాక్టర్లుకి చెందిన మనుషులు జులుం చూపిస్తారు. ఇక టెండర్ల విషయానికి వస్తే గత ఏడాది కాంటాక్ట్ పొందిన వ్యక్తులే ఈ ఏడాది లోపాయకారి ఒప్పడంతో టెండర్ దక్కించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎంతో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో భక్తులను నిలువునా దోచుకుంటున్న వారిపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News