Monday, December 23, 2024

పిడుగు పాటుకు పాడి ఎద్దు మృతి..

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: 66వ డివిజన్ హసన్‌పర్తి యాదవనగర్‌కు చెందిన సాయిని రాజుకు చెందిన గేదె బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పిడుగు పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న జీడబ్లూఎంసీ 66వ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ వెంటనే అక్కడికి వెళ్లి బాధితున్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read: 30మంది పిల్లలను రేప్ చేసి చంపిన సైకో.. చివరికి ఏమైందంటే..?

ఈ సందర్భంగా శ్రీధర్ పశువైద్య అధికారులు, తహసీల్దారుతో మాట్లాడి ప్రకృతి వైపరిత్యం వల్ల జరిగిన నష్టంతో బాధపడుతున్న ఆ కుటుంబానికి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వారితో పాటు ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, యూత్ నాయకుడు ఆకుల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News