Tuesday, January 21, 2025

పాము కాటుతో ఎద్దు మృతి

- Advertisement -
- Advertisement -

bull died due to snake bite in adilabad

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన దస్తగిర్ బేగ్ అనే రైతుకు చెందిన ఎద్దు ఆదివారం నాగుపాము కాటు వేయడంతో మృతి చెందింది. బాధిత రైతు దస్తగీర్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ పనులు ముగించిన అనంతరం ఎడ్లను వ్యవసాయ క్షేత్రంలో కట్టి ఉంచినట్లు తెలిపాడు. ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి వెళ్లి చూడగా ఎద్దు మృతి చెంది ఉందని ఈ సమాచారాన్ని పశువైద్యాధికారి డా. జీవన్ కు అందించగా పశువైద్య సిబ్బంది పరిశీలించి పాముకాటుతో మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపాడు. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు 60 వేల వరకు ఉంటుందని ప్రభుత్వ పరంగా తనను ఆదుకోవాలని బాధితుడు దస్తగిర్ వేడుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News