Thursday, January 23, 2025

విద్యుత్ షాక్‌తో కాడి ఎద్దు మృతి

- Advertisement -
- Advertisement -

చేగుంట: ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి కాడి ఎద్దు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కాశబోయిన మల్లేశం తండ్రి సత్తయ్యకు చెందిన ఎద్దు ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయాన్ని వెటర్నరీ డాక్టర్, విద్యుత్ అదికారులకు, రెవె న్యూ అదికారులకు తెలియజేసామని తెలిపారు. ఎద్దు మృతి వల్ల కాశబోయిన మల్లేశం నష్టపోయాడని ఆయనను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News