Wednesday, January 22, 2025

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్

- Advertisement -
- Advertisement -

 

bullet bandi Ashok
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన దాడుల్లో బుల్లెట్ బండి పాటతో ప్రసిద్ధయిన అశోక్ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో అశోక్ టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు. ఓ ఇంటి అనుమతి కోసం రూ. 30 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. అశోక్ నివాసంలో కూడా ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో ఓ పెళ్లి ఊరేగింపులో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన యువతి సాయి శ్రియ భర్తే అశోక్. ఆ డ్యాన్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News