Thursday, January 23, 2025

కీలక మైలురాయి దాటిన బుల్లెట్ ట్రైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ముందుగా ఇందులో భాగంగా 250 కిలోమీటర్ల మేర పిల్లర్ల ఏర్పాట్లు, 100 కిమీల వరకూ బ్రిడ్జిలు ఇతరత్రా నిర్మాణాలు జరిగాయి. ఈ విషయాన్ని ఈ రైలు కారిడార్ పనుల పర్యవేక్షణలో ఉన్న నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌ఎల్) శుక్రవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. కారిడార్ నిర్మాణానికి అత్యవసరం, కీలకమైన నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతిని తెలిపే ఫోటోలను శుక్రవారే కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఎక్స్ సామాజిక మాధ్యమంలో పొందుపర్చారు.

సూపర్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ పూర్తయిందని స్పందించారు. రైలు మార్గం నిర్మాణంలో అత్యంత కీలకమైన మైలురాయి వంటి స్టీల్ బ్రిడ్జిలను నిర్మించడం పూర్తి అయిందని మంత్రి నిర్థారించారు. మార్గ మధ్యంలో ఆరు నదుల మీదుగా రైలు మార్గం వెళ్లుతుంది. బ్రిడ్జిల మీదుగా ఇక్కడ మార్గం నిర్మించాల్సి ఉంటుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును రూ 1.08 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టారు. దీనికి 2017 సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు అత్యధిక భాగం నిధులను జపాన్ 0.1 శాతం వడ్డీ రూపంలో సమకూరుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News