Wednesday, January 22, 2025

కెసిఆర్ సభలో బుల్లెట్ల కలకలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరుగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ సభలో వ్యక్తి వద్ద రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకు న్నారు. అతడిని అస్లాంగా సభా ప్రాంగణంలోకి వస్తుండగా తనిఖీలు చేస్తున్న సమయంలో అస్లాం వద్ద ఈ బుల్లెట్లు దొరికాయి. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అస్లాం కర్నాటకలోని రాయికోడ్‌కి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. 2017లో డిగ్రీ మా నేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఓ యూట్యూబ్ చాన ల్ ఐడికార్డుతో ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లుగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News