Friday, November 15, 2024

‘శుద్ధి’పేట.. ఇక సేంద్రియ ఎరువుల అడ్డా!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: భూసారాన్ని కాపాడుకుంటేనే మంచి ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన భూమిత్ర సిద్దిపేట బ్రాండ్‌తో జీవ సంపన్న సేంద్రియ ఎరువులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రసాయనిక ఎరువులు వాడకంతో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయన్నారు. ఈ క్యాన్సర్ వ్యాధిన పడ్డ వారి కుటుంబాలు ఆర్థ్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చెత్త సమస్య పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. చెత్త గుట్ట లుగా పేరుకపోవడంతో భూ కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుందన్నారు. సిద్దిపేటలో చెత్త సమస్య లేకుండా చేసుకున్నామన్నామన్నారు. సిద్దిపేట మున్సిపల్ జనాభా 41,322 ఉందని ప్రతి రోజు 34 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు.

ప్రజలు సైతం తడి, పొడి, హానికర చెత్తను వేరు వేరు చేసి ఇస్తున్నారన్నారు. ప్రతి నెల 4500 కిలోల ఎల్ పిజీ గ్యాస్‌ను మన సిద్దిపేట మున్సిపాలిటీలో చెత్తతో తయారు చేసుకుంటున్నామన్నారు. అలాగే సేంద్రియ ఎరువులు, పొడి చెత్త విక్రయం ద్వారా మొత్తం నెలకు రూ. 21 లక్షల 71వేల ఆదాయాన్ని మన మున్సిపాలిటీ రాబడుతుందన్నారు. డంప్ యార్డు లేని శుద్దిపేటగా మన సిద్దిపేటను మార్చుకున్నామన్నారు. రసాయనిక ఎరువులతో పాటు పండించిన ఆహారం తినడంతో బిపి, షుగర్ లాంటి దీర్ఘ కాలిక వ్యాధులు సంభవిస్తున్నాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. ఒక్కొక్క ఆయిల్ పామ్ మొక్కకు రెండున్నర కిలోల సేంద్రియ ఎరువులు వేయడం ఎంతో మంచిందన్నారు.

రైతులు సేంద్రియ ఎరువులు కొనడానికి ముందుకు రావాలన్నారు. అనంతరం వ్యవసాయ డ్రోన్ స్పింక్లర్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎఎంసి చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, డాక్టర్ శాంతి కుమారి ప్రజాప్రతినిదులు, నాయకులు పాల సాయిరాం, రాజనర్సు, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, జంగిటి కనకరాజు, నాగిరెడ్డి, మాణిక్యరెడ్డి, సారయ్య, కనకయ్య , నాగరాజురెడ్డి, మల్లికార్జున్, తిరుమల్‌రెడ్డి, రియాజ్, మోయిజ్, ఆనంద్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News