Monday, January 20, 2025

ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లర్ అంశాలతో బంపర్..

- Advertisement -
- Advertisement -

తమిళంలో 2023న విడుదలై విజయవంతమైన బంపర్ సినిమా తెలుగులో రాబోతోంది. బంపర్ అనే టైటిల్ కేరళ లాటరీ నేపథ్యంగా రూపొందింది. ఈ చిత్రంలో వెట్రి, శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించగా, హరీష్ పేరడి, జి.పి. ముత్తు, తంగదురై, కవితా భారతి సహాయక పాత్రలు పోషించారు. ఎం. సెల్వకుమార్ రచన, దర్శకత్వం వహించబడిన ఈ చిత్రం థ్రిల్లర్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా పేరుతెచ్చుకుంది.

ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. స్నేహితులతో కలిసి అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్ళిన ఓ యువకుడికి అక్కడ కొన్న లాటరీ టిక్కెట్‌కు ప్రైజ్ మనీ వస్తుంది. దాన్ని చేజిక్కించుకునేందుకు అతను పడ్డ కష్టాలు, స్నేహితులతో ఇబ్బందులు అనేవి ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూపిస్తూ ఓ థ్రిల్లర్ అంశాన్ని జోడించిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేపుతూ ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో తెలుగులో విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News