Saturday, December 21, 2024

బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Bumper offer to rashmika mandanna

 

బాలీవుడ్ లో పాగా వేయాలని హాట్ బ్యూటీ రష్మిక మందన్న సీరియస్ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ఉత్తరాదిన సత్తా చాటాలని చూస్తోంది. ఇటీవలే ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులర్ అయింది. ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్‌లో బంఫర్ ఆఫర్ వరించినట్లు సమాచారం.

టాలీవుడ్ స్టార్ మేకర్ సందీప్ రెడ్డి వంగ… రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేయడానికి రష్మికతో చర్చలు జరుపుతున్నారట. రష్మిక ఛరిష్మా ఆ పాటకు ప్లస్ అవుతుందని సందీప్ భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఆమెని తీసుకునే దిశగా ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఆఫర్ వెనుక రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News