Friday, December 20, 2024

బుమ్రా బౌలింగ్ ను అలా ఎదుర్కొవాల్సిందే: ఇంగ్లాండ్ కోచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండో టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తెలిపారు. విశాఖపట్నం స్పీన్ బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై అతడు ఎలా బౌలింగ్ చేశాడనేది పుస్తకాల్లో వీడియోల్లో చూస్తే సరిపోదని వివరణ ఇచ్చారు. అలాంటి పిచ్‌పై బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి విజయంలో కీలకంగా మారాడు. అందుకే మేము థియరీని విశ్వాసంలోకి తీసుకోమని చెప్పారు. బుమ్రా బౌలింగ్‌పై చర్చ పెడితే సరిపోదని, కఠినంగా సాధన చేయాలని సూచించారు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వివిధ మార్గాలు ఉన్నాయని, మా బ్యాటర్లు ఈ విషయంపై స్పష్టంగా ఉన్నారని తెలిపాడు.

మిగిలిన మూడు టెస్టుల్లో బుమ్రా బౌలింగ్ తిప్పికొడుతామని, స్వింగ్ అయితే మాత్రం అతడు బౌలింగ్ ఎదుర్కొకోవడం కష్టం అని తెలియజేశారు. రెండు టెస్టులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశారని, గత సంవత్సరం నుంచి తాము అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కున్నామని చెప్పారు. మూడో టెస్టుకు సమయం లభించడంతో అబుదాబి వెళ్లామని, బ్రిటన్ చాలా దూరం కావును అబుదాబిలో ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పారు. టీమిండియా ఆటగాళ్లు మాత్రం ఇంటికి వెళ్లారని భారత జట్టు కోచ్ దావిడ్ చెప్పారు. మూడో టెస్టుకు రాజ్‌కోట్‌కు వచ్చేస్తామని ఇంగ్లాండ్ కోచ్ వెల్లడించారు. భారత్-ఇంగ్లాండ్ జట్లు చెరొకటి గెలిచి సమంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News