- Advertisement -
ఢిల్లీ: హైదరాబాద్, వైజాగ్ పిచ్ మాదిరిగానే రాజ్‌కోట్ పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ తెలిపాడు, మొదటి రెండో రోజులు పేస్ బౌలర్లకు అనుకూలించడంతో బ్యాట్‌కు, బంతికి మధ్య పోటీ ఉంటుందని చెప్పాడు. మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలిస్తుందని, రివర్స్ సింగ్ చేసే అవకాశం ఉంటుందని వివరించాడు. నాలుగు, ఐదో రోజుల్లో స్పిన్‌కు అనుకూలంగా పిచ్ మారడంతో స్పినర్లు విజృంభిస్తారని పేర్కొన్నాడు. ఇలా జరిగితే రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో మజా ఉంటుందని తెలియజేశారు. బుమ్రా, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని చెప్పారు. బుమ్రా రివర్స్ సింగ్‌తో చెలరేగుతాడన్నాడు. రెండు టెస్టులలో చెరొక మ్యాచ్ గెలిచి ఇరు జట్లు సమజ్జీవులుగా ఉన్నారు.
- Advertisement -