ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం.. ఆ జట్టుకు తీరని లోటే. ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా.. ఆ తర్వాత టీం ఇండియా ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్పనలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో కూడా అతను ఆడటం లేదు. అయితే బమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని.. ఒక వేళ కాదని జట్టులోకి వస్తే.. గాయం తీవ్రమై ఫ్రాక్చర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో బుమ్రా ఇంకొంత కాలం వైద్యుల పరిరక్షణలో ఉండాలి. ఐపిఎల్ తర్వాత భారత్.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు బుమ్రా జట్టులో ఉండటం ముఖ్యం. కాబట్టి.. ఐపిఎల్‌లో బుమ్రా ఆడేందుకు బిసిసిఐ సుముఖత చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బుమ్రా బదులుగా ఇంకో పేసర్‌ని తీసుకోవాల్సిదిగా ముంబై ఇండియన్స్ జట్టుని బిసిసిఐ అడిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రా ఐపిఎల్‌లో ఆడుతాడో లేదో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇక టోెర్నమెంట్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది.