Thursday, January 23, 2025

ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బుమ్రా ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా నాలుగు ఫోర్లు, మరో రెండు సిక్సర్లు కొట్టాడు. అందులో ఒకటి నో బాల్ కావడంతో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. అంతేగాక ఐదు పరుగులు వైడ్ రూపంలో లభించాయి. దీంతో ఈ ఓవర్‌లో భారత్‌కు రికార్డు స్థాయిలో 35 పరుగులు లభించాయి. టెస్టు క్రికెట్‌లో ఇది కూడా ఒక రికార్డు కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న ఒకే ఓవర్‌లో 28 పరుగుల రికార్డును తిరగరాశాడు.

Bumrah Create World Record for most runs in Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News