బెంగళూరు: రానున్న ఛాం పియన్స్ ట్రోఫీలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. ఫిట్‌నెస్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేందుకు బిసిసిఐ సిద్ధంగా లేదు. ఇదే జరిగితే మెగా టోర్నీలో భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బుమ్రా లేని లోటును పూడ్చడం అనుకున్నంత తేలికేం కాదు. ఒకవేళ బుమ్రా ఫిట్‌నెస్‌ను సాధించడంలో విఫలమైతే అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో మెరుగ్గా రాణించిన వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరిని తప్పించి వరుణ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఛాంపియర్ ట్రోఫీకి బుమ్రా డౌటే?
- Advertisement -
- Advertisement -
- Advertisement -