Tuesday, January 7, 2025

టాప్‌లోనే బుమ్రా, రూట్

- Advertisement -
- Advertisement -

రెండో ర్యాంక్‌కు బ్రూక్,
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో జస్‌ప్రిత్ బుమ్రా (భారత్), జో రూట్ (ఇంగ్లం డ్) టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో రూట్, బౌలింగ్‌లో బుమ్రా అగ్రస్థానం లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయం లో కీలక పాత్ర పోషించిన బుమ్రా ర్యాంకింగ్స్‌లో నూ పైచేయి సాధించాడు. తాజా ర్యాంకింగ్స్‌లోనూ అతని టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. 883 రేటింగ్ పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.

కగిసో రబాడ (సౌతాఫ్రికా) రెండో, జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్వి న్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలి యా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానాన్ని మెరుగు ప రుచుకుని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత స్పిన్న ర్ రవీంద్ర జడేజా కూడా ఒక ర్యాంక్ ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాథన్ లియాన్ (ఆస్ట్రేలి యా), ప్రభాత్ జయసూర్య (శ్రీలంక), మార్కొ జా న్సెన్ (సౌతాఫ్రికా), మ్యాట్ హెన్రీ(కివీస్) టాప్10లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విబాగంలో జో రూట్ 895 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కే చెందిన హ్యారి బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నా డు.

ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కినెట్టి బ్రూ క్ ఈ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. యశస్వి జైస్వాల్ రెండు ర్యాంక్‌లు కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. డారిల్ మిఛెల్ (కివీస్) ఐదో, రిషబ్ పంత్ (భారత్) ఆరో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ తెంబబవుమా ఏకంగా 14 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని పదో స్థానానికి చేరుకున్నాడు. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి 14వ, శుభ్‌మన్ గిల్ 18వ ర్యాంక్‌లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News