Monday, December 23, 2024

ఆ సత్తా బుమ్రాకు ఉంది: మహ్మద్ కైఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రానే చాలా కీలకమని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా జట్టులో ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్టేనన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తన బౌలింగ్‌తో జట్టును గెలిపించే సత్తా బుమ్రాకు ఉందన్నాడు. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో బుమ్రా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమన్నాడు. సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నా దాని ప్రభావం బుమ్రా బౌలింగ్‌పై పడదన్నాడు. తన దృష్టిలో ప్రపంచ క్రికెట్‌లో బుమ్రాను మించిన మ్యాచ్ విన్నర్ లేడంటే అతిశయోక్తి కాదన్నాడు. ఈసారి అతనే జట్టుకు ప్రధాన అస్త్రం అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక విండీస్ సిరీస్‌లో హార్దిక్ పాండ్యకు పరిస్థితులు కలిసి రావడం లేదన్నాడు. ఈ స్థితిలో ప్రధాన కోచ్ ద్రవిడ్ అతనికి అండగా నిలువాలని కైఫ్ సూచించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News