Monday, January 6, 2025

గాయంతో మైదానం వీడిన బుమ్రా

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా మైదానం వీడడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బుమ్రా బౌలింగ్ చేస్తుండగా గాయపడడంతో మైదానం నుంచి బయటకు వచ్చాడు. మెడికల్ సిబ్బందితో కలిసి అతడు స్కానింగ్ వెళ్లినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక వేళ బుమ్రాకు గాయపడితే మాత్రం టీమిండియాకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. స్కానింగ్‌లో ఏమీ లేదని వస్తే మాత్రం క్రికెట్ అభిమానుల పండుగ చేసుకుంటారు. ఐదో టెస్టులో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 185 పరుగులు చేయగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News