Monday, April 7, 2025

బుమ్రా ఈజ్ బ్యాక్.. ముంబై ఫేట్ మారనుందా..?

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అంటే ఓ రేంజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీ అందుకున్న ముంబై 18 సీజన్‌‌ని చెత్తగా ప్రారంభించింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓటమిపాలైంది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకి శుభవార్త అందింది. గాయం కారణంగా ఇంతకాలం జట్టుకు దూరమైన ఏస్ పేసర్ జస్స్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా గాయడపపడ్డాడు. అప్పటి నుంచి అతను బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉంటూ చికిత్స పొందాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న బుమ్రా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో అతను జత కట్టే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అందుకు బిసిసిఐ నుంచి అనుమతి లభించిందట. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో బుమ్రా ఐపిఎల్‌ 18వ సీజన్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మరి బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్ ఫేట్ ఎలా మారుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News