Monday, April 7, 2025

‘ది లయన్ ఈజ్ బ్యాక్’.. ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐపిఎల్ లోనూ అడుగుపెట్టలేదు. దీంతో ముంబై జట్టు బౌలింగ్ విభాగంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓడిపోయి.. ఒకటి మాత్రమే గెలిచింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ముంబై.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. బుమ్రా తిరిగి జట్టుతో కలిసినట్లు వెల్లడించింది. ఐపిఎల్ లో ఆడేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఓ స్పెషల్ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. బుమ్రా జట్టులో చేరితే మాత్రం కాస్తా బలంగా మారుతుందనడంలో సందేహం లేదు. కాగా, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News