- Advertisement -
ముంబయి: భారత క్రికెట్ ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా సోమవారం వివాహం చేసుకున్నాడు. గోవాలో తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను పాస్ట్ బౌలర్ బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు అని, తన పెళ్లి వేడుకను అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందంతో ఉన్నానని భుమ్రా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులుగా బుమ్రా, సంజన వివాహం చేసుకోబోతున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వివాహం కోసం బుమ్రా ఇంగ్లాండ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐపిఎల్-2020 సీజన్ కు సంజన స్పోర్ట్ ప్రజెంటర్‌గా పని చేస్తున్నారు.
- Advertisement -