Sunday, December 22, 2024

టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ గా బుమ్రా రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండో టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లు తీయడంతో బుమ్రా టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ఫేస్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్ చేరుకోడం ఇదే తొలిసారి. గతంలో భారత స్పినర్లు బిషన్‌సింగ్ బేడీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. 881 రేటింగ్ పాయింట్లతో బుమ్రా తొలి స్థానంలో ఉండగా టాప్ ర్యాంకులో ఉన్న అశ్విన్ 841 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 851 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు బుమ్రా 34 టెస్టులు ఆడి 155 వికెట్లు తీసుకున్నాడు. గతంలో బుమ్రా 2017 నవంబర్ 4న తొలిసారి టి20 పార్మాట్, 2018 ఫిబ్రవరి 4న తొలిసారి వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంకు చేరుకున్న బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంకు, టి20ల్లో వందో ర్యాంకులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News