Saturday, January 18, 2025

చివరి టెస్టుకోసం బుమ్రా వచ్చేశాడు!

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్టులో టీమిండియా జట్టు కూర్పుపై  కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు టెస్టుల సీరీస్ లో 3-1 తో భారత జట్టు ముందంజలో ఉంది. ఐదో టెస్టులో కూడా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా, ఈ టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

ధర్మశాలలో జరిగే ఐదవ టెస్ట్ లో పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. బంతి స్వింగయ్యే అవకాశం ఉండటంతో మరొక పేస్ బౌలర్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నాలుగో టెస్టులో విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఈసారి జట్టులోకి రావచ్చు. సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా ఆడతారు. అశ్విన్, రవీంద్ర జడేజా వికెట్లు తీయడంలో ముందుండటంతో వారికి చోటు ఖాయం. ఇలా చూస్తే కుల్దీప్ పై వేటు పడే అవకాశం ఉంది. ఇక వరుస ఇన్నింగ్స్ లో విఫలమైన రజత్ పటీదార్ కు ఐదో టెస్టులో స్థానం ఉంటుందా అనేది అనుమానమే. ధ్రువ్ జురెల్ మాత్రం కొనసాగుతాడని గట్టిగా చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News