Friday, January 24, 2025

ఆ విషయంలో మౌనంగా ఉండడమే సరైన జవాబు: బుమ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బుమ్రా సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం సృష్టించింది. “కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జావాబు అంటూ” తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుమ్రా పోస్టు చేయడంతో కలకలం రేపింది. ముంబయి ఇండియన్స్ జట్టు తరపున 2015 నుంచి ఆడుతున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఎంఐని బుమ్రా అన్‌ఫాలో అయినట్లు అభిమానులు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ముంబయి ఇండియన్స్ నుంచి ఆర్‌సిబికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్ వదులుకున్న తరువాత బుమ్రా కెప్టెన్ కావాలనుకున్నట్టు సమాచారం. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తిరిగి ముంబయి జట్టులో చేరడంతో అతడు అడ్డుగా ఉన్నాడని బుమ్రా గహించాడు. ముంబయిని వీడిపోయే అవకాశాలు బుమ్రా ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News