Thursday, December 19, 2024

ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు హైదరాబాద్‌లో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ “నా గత సినిమాల మాదిరిగా ఈ చిత్రాన్ని కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చేయడం జరిగింది. చిరంజీవి మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో మా సినిమా ఎంతో మందికి రీచ్ అయింది. గోపీచంద్ గత సినిమాల లాగా ఈ సినిమాలో కూడా మంచి వినోదం ఉంటుంది. జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది”అని అన్నారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. “మారుతి మార్క్ అంటే 100 శాతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి కడుపారా నవ్వుకొని వెళ్లే సినిమాలు ఉంటాయి. భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండగే… ఇలా తన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా మంచి వినోదం ఉంటుంది. ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ సినిమా కూడా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే చిత్రంగా నిలుస్తుంది”అని తెలిపారు.

Bunny Vasu interview about Pakka Commercial Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News