Monday, December 23, 2024

12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన: బూర నర్సయ్య గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వ బిసి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు బిజెపి నేత, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిసిలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అష్టదిగ్బంధం చేస్తోంది. ఓట్ల కోసమే బిసిలకు రూ. లక్ష భిక్షమిస్తున్నరు. కెసిఆర్ బిసి వ్యతిరేక విధానాలపై ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకోవడానికి మూడు రోజుల సమయం సరిపోదన్నారు. మణిపూర్ అల్లర్ల మంటల్లో విపక్షాలు చలికాచుకుంటున్నాయి. హైదరాబాద్‌లో డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిని నగ్నంగా చేస్తే పోలీసులు ఏమైపోయారు. ఘటనకు కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న తాగుబోతు విధానమే కారణం. ఏం మొహం పెట్టుకుని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతారు’ అని నర్సయ్యగౌడ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News