Saturday, November 23, 2024

డ్రగ్స్‌ను అడ్డుకోవడానికే నార్కోటిక్ బ్యూరో

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: డ్రగ్స్‌ను రాష్ట్రంలో అడ్డుకోవడానికే తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. టిఎస్‌నాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెచ్‌సియూ, జెఎన్‌టియూ ఫైనార్ట్ విద్యార్థులతో కలిసి ఆదివారం బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఉందని, వాటిలో తె లంగాణ ఒకటని అన్నారు.

ఇక్కడ నెల రోజుల క్రితం ఏర్పడిన టిఎస్‌నాబ్ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధానికి చట్టాలను చేస్తుందని తెలిపారు. భారతదేశంలో ఇప్పటి వరకు 11.5కోట్లు మంది డ్రగ్స్‌కు బానిసలుగా మారారని, వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా చిత్రాలు, డిజైన్‌ల ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి సీతారామారావు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి మాదకద్రవ్యాలు అడ్డుపడతాయని, దీని వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. తమ శాఖ టిఎస్‌న్యాబ్‌తో కలిసి పనిచేస్తుందని డిడబ్లూసిడిఎస్ డైరెక్టర్ శైలజ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పిలు సునీత, చక్రవర్తి, యూనివర్సిటీ హెచ్‌ఓడిలు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News