Sunday, December 22, 2024

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారీ వర్షాల దృష్ట్యా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్‌లు, ఎస్‌పిలు, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్, అధికారులతో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ తెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లోని చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు శిథిలావస్థ భవనాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

కొన్ని చోట్ల ఇప్పటికే చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News