Sunday, December 22, 2024

గర్ల్‌ఫ్రెండ్‌పై కారు పోనిచ్చిన కేసు… నిందితునికి బెయిల్

- Advertisement -
- Advertisement -

థానే : థానేకు చెందిన గర్ల్ ఫ్రెండ్ ప్రియాసింగ్‌ను కారుతో తొక్కించి తీవ్రంగా గాయపర్చిన సంఘటనలో నిందితుడు అశ్వజిత్ గైక్వాడ్‌కు సోమవారం బెయిల్ మంజూరైంది. మహారాష్ట్ర సీనియర్ బ్యూరోక్రాట్ కుమారుడైన గైక్వాడ్‌తోపాటు, ఆయన ఇద్దరుస్నేహితులు రోమిల్‌పాటిల్, సాగర్ షిండేలకు రూ. 15,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. గైక్వాడ్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసిన ప్రియాసింగ్ డిసెంబర్ 11న అశ్వజిత్ తనపై దౌర్జన్యం చేయడమే కాక, తన కాళ్లపై కారుతో తొక్కించి పారిపోయాడని ప్రియాసింగ్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను గైక్వాడ్, ఆయన కుటుంబీకులు కొట్టి పారేశారు. ఈ సంఘటన పూర్తిగా తన నుంచి డబ్బుగుంజడానికి చేస్తున్న ప్రయత్నమేనని గైక్వాడ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News