Sunday, December 22, 2024

సంజీవన్‌రావుపేట్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ

- Advertisement -
- Advertisement -
  • రూ. 2లక్షలు అపహరణ

నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని సంజీవన్‌రావుపేట్‌లో తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. వివరాల ప్రకారం గ్రా మానికి చెందిన బాలమల రాములు వరి ధా న్యం విక్రయించగా వచ్చిన డబ్బులు రూ.2లక్ష లు బీరువాలో పెట్టారు. సోమవారం మ ధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో పనులు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లారు. కాగా తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి వేసిన తాళం వేసినట్లే ఉంది కానీ ఇంటి పక్కనే గోడ సమీపం లో ఎవరో తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానంతో రాములు బీరువాను తెరిచి చూసే సరికి రూ.2లక్షలు నగదు కనిపించలేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళాన్ని దర్జాగా తీసి బీరువా తాళం సైతం తీసి డ బ్బులు దొంగలించి ఎవరికి అనుమానం రాకుండా యధావిధిగా బీరువాకు, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారన్నారు. కాగా మంగళవారం ఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాములు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News