Friday, December 20, 2024

తలకొండపల్లిలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..కెసిఆర్ ఇచ్చిన హామీలు ఉచిత నిర్భంధ విద్య, ఫీజురీయింబర్స్‌మెంట్స్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్‌రూం, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, దళితబంధు, పోడు భూములకు

పట్టాలు, రైతు ఋణమాఫీ, ముస్లీంలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల వంటి అనేక హామీలను విస్మరించారన్నారు. కెసిఆర్ పది తలల రావణుడిగా మారి అసత్యాలు, అబాద్ధాలు ఆడుతున్నాడని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, రాములు, రవీందర్‌యాదవ్, అజీమ్, రమేష్, అనిల్, శివ, శ్రీను, జగన్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News