Tuesday, April 15, 2025

కెటిఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా లోకం

- Advertisement -
- Advertisement -

ఉచిత బస్ ప్రయాణంలో మహిళలను కించపరుస్తూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. కెటిఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల కెటిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం పట్ల మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు చేయండి అంటూ అత్యంత ఆవహేళనగా మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News