Friday, November 22, 2024

జాతీయ రహదారిపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

 

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని దూదిగాం చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై మున్నూరుకాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై ఈడి, ఐటి దాడులు చేయడం అన్యాయమన్నారు. మెండోరా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మున్నూరుకాపు కులస్తులకు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బిసి బిడ్డను ఎదుగుదలను ఓర్వలేక బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని మున్నూరుకాపు సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో మున్నూరుకాపు కులాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును మండిపడ్డారు. నల్లా బ్యాడ్జీలు ధరించి, ర్యాలీ నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. ఈడి, ఐటి దాడులను వెంటనే ఆపాలని లేదంటే కేంద్ర ప్రభుత్వానికి బీసీలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. బిజెపి డౌన్ డౌన్.. మోడీ డౌన్ డౌన్ బీసీల ఐక్యత వర్థిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులు దూదిగాం ఓడ్డం దేవేందర్, పి. శ్రీను, ఎ. రాజు, ఎన్. నర్సయ్య, కంచెట్టి సావేల్ పుప్పాల రాజు, రాజారెడ్డి, శేఖర్, చాకిర్యాల్ శ్రీధర్, దేవన్న, బిసి నాయకుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News