Monday, January 20, 2025

మంత్రి హరీష్‌రావు దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

గద్వాల: ముస్లిం మైనార్టీలను కించపరిచే విధంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ముస్లింలను ఫకీర్ ముస్లింలతో సంబోధించినందుక శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైస్‌ఆర్ చౌక్‌లో మంత్రి హరీష్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిఫాయతుల్లా, పట్టణ అధ్యక్షుడు కౌసర్‌బేగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మొహ్మద్ ఇసాక్ మాట్లాడుతూ.. గురువారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్‌ల

సన్మాన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు ముస్లింలను ఫకీర్‌లతో పోలుసూత సంబోధించారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న చివరి రోజుల్లో ముస్లిం మైనార్టీలకు లక్ష రూపాయల రుణాలు ఇస్తామని చెప్పడం సిగ్గు చేట్టుఅని అన్నారు. మంత్రి హరీష్‌రావు ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షులు జమాల్, నాయకులు ముక్రం, శాష, మజీద్, జాంగీర్, ఇలియాస్, మోనిద్దీన్, అప్రోజ్, మహబూబ్,రఫి, గోనుపాడు ఖాజా, మహబూబ్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News