Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని దనసిరి గ్రామ చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆద్వర్యంలో ధహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివి, తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందన్నారు. 70 యేళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత కరెంట్ అందించిన ఘనత ముఖ్యమ ంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చే సుకున్న దుస్థితి ఉండేదని, ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రైతులకు భరోసాగా రైతుబందు, రైతుభీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి మరెన్నో సంక్షేమపథకాలను అందిస్తూ భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. మొదటినుంచి కాంగ్రెస్ రైతులంటే చిన్న చూపే,మొన్న ధరణి వద్దన్నారు, ఇప్పుడు వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్, ఒక చీటర్ 5 నిమిషాలలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్న ధరణి పోర్టల్‌ని కూడా వద్దంటున్నారన్నారు.

రైతులతో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రైతులంతా ఇదంతా దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నిక ల్లో మూడుగంటల అన్న కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధిగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, బీఆర్‌ఎస్ పార్టీ మొగుడంపల్లి మండల అద్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ యాదవ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బంగారు సురేష్, నాయకులు ఢిల్లీ వసంత్, ఇజ్రాయిల్ బాబీ, మిథున్ రాజ్, ప్ర తాప్ కులకర్ణి, ఓంకార్‌రెడ్డి, తిమోతి, నయీముద్దీన్, విజయ్‌రెడ్డి, ఉపేందర్ పాటిల్, ఇస్మాయిల్, రాజు, దత్తాత్రి, జనార్దన్, వీరేష్, గోవింద్‌రెడ్డి, పాపయ్య, మైపాల్, దినేష్, చిన్న మాధవ్‌రెడ్డి, శంకర్, హర్షవర్దన్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News