Sunday, December 22, 2024

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: తెలంగాణ రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్‌స్టాప్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులకు మూడేగంటలు కరెంటుచాలన్న కాంగ్రెస్ పార్టీ, ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి అని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్‌డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు.

రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి కూడా రానివ్వబోమని రైతన్నలు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు సిఎం కెసిఆర్ అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని స్పష్టం చేశారు.

రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటిలు డివిజన్ల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News