Friday, December 20, 2024

మండుతున్న ఎండలు..బెదురుతున్న నగర వాసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ తీవ్రతకు నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చెరువ కావడంతో ఎండ వేడిమి అంతకంతా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలైతే నగరవాసులను మరింత కలవరపెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన కనిస్ట ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 33. నుంచి 35 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం నిప్పుల కొలిమి రాత్రిళ్లు ఉక్కుపోత. అన్నట్లు గా వాతావరణ మారిపోయింది. ఖైరతాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదు కాగా, ఉస్మానియా యూనివర్సీటీ ప్రాంతంలో రికార్టు స్థాయిలో కనిష్ట ఉషోగ్రత ఏకంగా 34.8 డిగ్రీలుగా నమోదైంది.

దీంతో పగలు సెగలు కుక్కతున్న ఎండ వేడిమితో, రాత్రి వేళ ఉక్కుపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల లోపే ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో బయటికి రావాలంటే నగరవాసులు జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి రాలేకపోతున్నారు. ఎండలకు వేడి గాలులుగా తోడవుతుండడంతో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 4 గంటల కు రోడ్లపై జనా సంచారం చాలా తక్కువగా కనిపిస్తోంది.మరోవైపు ఎండలు ముదిరిపోవడంతో నగరంలో మెట్రో రైలు మరింత ఆదారణ పెరగగా ఆర్టీసీ మాత్రం తగ్గింది. ఈ వారంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో నగరవాసులు మరింత భయాందోళనలకు గురువుతున్నారు.
భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ః
మేమూడో వారంలో ప్రవేశంతోనే కనిష్ట ఉష్ణోగత్రలు భారీగా నమోదు అవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదు అవుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఒక్కసారిగా ఆమాంతం పెరిగిపోయ్యాయి. ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉస్మానియా యూనివర్సీటీ పరిసర ప్రాంతంలో 34.8 డిగ్రీలు నమోదైంది. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో 33 నుంచి 34 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతుల నమోదు అయ్యాయి. ఇవి సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికం కావడంతో రాత్రి వేళ ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ ప్రాంతం పూర్తిగా కాంక్రీట్ జంగల్‌ను మారడంతో రాత్రి వేళా గాలి లేక ఉక్కపోతతో నిద్రపోని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇళ్లు , కార్యాలయాలలోని ఎసిలతో పాటు నగరంలో లక్షలాది వాహానాల కారణంగా మరింత వేడి పెరిగిపోతుండడంతో మధ్య తరగతి, నిరు పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వేడికి ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు కూడా సరిపోకపోతుండడంతో ఉక్కపోతకు నగరవాసులు బెదిరిపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News