Friday, December 20, 2024

మొయినాబాద్ లో కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దాదాపు 90% కాలిన గాయాలతో ఒక మహిళ మృతదేహాన్ని గ్రామస్థులు పొలంలో గుర్తించారు. వ్యవసాయం చేస్తుండగా మృతదేహాన్ని గ్రామస్థులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలం నుంచి సగం కాలిపోయిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మహిళ మిస్సింగ్ ఫిర్యాదు అందితే తనిఖీ చేసేందుకు మొయినాబాద్ పోలీసులు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News